తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు… ఎనిమిది మంది మృతి

  • Publish Date - July 10, 2020 / 11:43 PM IST

తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం (జులై 10, 2020) ఎనిమిది మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1013 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 32,224 కు చేరింది. మొత్తం కరోనా సోకి 339 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో 12,680 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని 19,205 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 762 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి 171, మేడ్చల్ 85, సంగారెడ్డి 36, నల్గొండ 32, కామారెడ్డి 23, మెదక్ 22, ఖమ్మం 18, మంచిర్యాల 17, ఆదిలాబాద్ 14, మహబూబ్ నగర్ జిల్లాలో 14 కేసులు నమోదు అయ్యాయి.

కరీంనగర్ 9, నారాయణపేట 9, నిజామాబాద్ 8, వరంగల్ రూరల్ 8, సిరిసిల్ల 7, మహబూబాబాద్ 6, పెద్దపల్లి 6, వరంగల్ అర్బన్ 5, సిద్ధిపేట 4, జనగామ 3, నిర్మల్, యాదాద్రి ఆసిఫాబాద్, వనపర్తి, గద్వాలలో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి.