కోవిడ్-19 సంక్షోభ సమయంలో భారత్ వరల్డ్ బ్యాంక్ భారీ ఊరట నిచ్చింది. భారత్ లోని పట్టణ పేదలు, వలస కార్మికులకు సామాజిక భద్రతా రక్షణ నిధి(సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ)కింద 1 బిలియన్ డాలర్లు(7వేల 549కోట్లు)సహాయాన్ని అందించేందుకు ప్రపంచబ్యాంక్ ఆమోదం తెలిపింది.
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికి వివిధ దేశాలకు 160 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని అందించే ప్రణాళికను ప్రపంచ బ్యాంక్ గత నెలలోనే ఆమోదించింది. ఈ మేరకు ఆయా దేశాలకు నిధులు ప్రకటిస్తోంది. సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్న వరల్డ్ బ్యాంక్… కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్ కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రకటించింన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బిలియన్ డాలర్లు అందివ్వనుంది.
సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద భారత్‌లోని 400కు పైగా సామాజిక భద్రతాపథకాల అమలుకు 1బిలియన్ డాలర్లు ఉపయోగపడనున్నాయని వరల్డ్ బ్యాంకు తెలిపింది. కోవిడ్-19, లాక్‌డౌన్ వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు, ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న సమయంలో వరల్డ్ బ్యాంక్ నుంచి ఈ గుడ్ న్యూస్ వచ్చింది. ఆరోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద ప్రాజెక్టు అని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
ఈ సంక్షోభ సమయంలో పేదలకు నగదు లభ్యత, ఆహార ప్రయోజనాలతో భదత్రను కల్పించాలనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వరల్డ్ బ్యాంకు తెలిపింది. సామాజిక భద్రత విషయంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణ పేదలకు కరోనాకు ముందు పరిస్థితిని తేవడానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం అని భారత్ లో వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ జునైద్ అహ్మద్ అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర్ మిషన్ చాలా ముఖ్యమైనదని ప్రశంసించారు. లాక్‌డౌన్ ఎఫెక్టుతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా ఆత్మనిర్భర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిరోజుల కిందటే ప్రకటించిన విషయం తెలిసిందే.
కోవిడ్ -19 తరువాత దేశంలో జీవితం, జీవనోపాధి పరిస్థితుల్లో పెద్ద తేడా ఉండబోదని భావిస్తున్నాన్నారు. నగదు బదిలీ విధానం చాలా కీలకమైందని, దాని వల్ల జీవణ ప్రమాణాలు చాలా వేగంగా, సులువుగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంకు సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరక్టర్ మైఖేల్ రుట్కోస్కీ తెలిపారు.
Read Here>> కోవిడ్-19పరిస్థితిపై బిల్ గేట్స్ తో మాట్లాడిన మోడీ