తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు… ఏడుగురు మృతి

  • Publish Date - July 17, 2020 / 11:10 PM IST

తెలంగాణలో కొత్తగా 1478 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇవాళ ఏడుగురు మృతి చెందారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే 806 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 42,496కి చేరింది. ఇప్పటివరకు 403 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారందరూ చికిత్స పొందుతున్నారు.

ఇవాళ కరోనా నుంచి కోలుకొని మరో 1410 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 28,705 మంది డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం 15,124 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 2,22,693 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది.

రంగారెడ్డి 91, మేడ్చల్ 82, కరీంనగర్ 77, వరంగల్ అర్బన్ 51, పెద్దపల్లి 35, నల్లగొండ 35, కామారెడ్డి జిల్లాలో 31 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజన్నసిరిసిల్ల 27, మెదక్ 23, నాగర్ కర్నూల్ 23, సంగారెడ్డి 20, మహబూబ్ నగర్ 19, ఖమ్మం 18, వికారాబాద్ 17, మంచిర్యాల 15 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.