తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు.
తాజాగా లెక్కలతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కు చేరింది. 375 మంది మృతి చెందారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,531 ఉన్నాయి. ఇప్పటివరకు 24,840 మంది డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం 13,175 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు 1,95,024 మందికి టెస్టులు చేసినట్లు తెలిపారు.
రంగారెడ్డి 240, మేడ్చల్ 97, సంగారెడ్డి 61, నల్గగొండలో 38, వరంగల్ అర్బన్ 30, కరీంనగర్ 29, మెదక్ 24, వికారాబాద్ 21, కామారెడ్డి 19, సిరిసిల్ల 19, నిజామాబాద్ 17, సూర్యపేట 15, గద్వాల 13, మంచిర్యాల 12, భూపాలపల్లి 12, ఖమ్మం 8, మహబూబ్ నగర్ 7, ములుగు 6, ఆసిఫాబాద్ 5, వనపర్తి 5, సిద్దిపేట 4, నిర్మల్ జిల్లాల్లో 3 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.