Poisonous Snakes : మంచిర్యాలలో విష సర్పాల కలకలం..వర్షాలు, వరదలకు కొట్టుకొచ్చిన పాములు

మంచిర్యాల కాలేజ్‌ రోడ్‌లోని గౌతమేశ్వర ఆలయం దగ్గర ఉన్న చెట్లపై 20 భారీ విషసర్పాలు కనిపించాయి. చెట్ల కొమ్మలపై తిరుగుతున్న వీటిని చూసి స్థానికులు భయపడుతున్నారు. ఆలయం సమీపంలో తొలుత ఒక పామును గుర్తించారు. క్షుణ్ణంగా చెట్లను పరిశీలిస్తే కొమ్మలపై మరికొన్ని పాములు కనిపించాయి.

Snake

poisonous snakes : గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో ఆ ప్రవాహంలో విష సర్పాలు కొట్టుకువస్తున్నాయి. దీంతో ముంపు ప్రాంతాల వాసులు తీవ్ర భయందోళనల్లో ఉన్నారు. భారీ వర్షాలు, వరదలకు పూర్తిగా జలమయమైన మంచిర్యాలలోని పలు ప్రాంతాల్లో పాములు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి కొట్టుకొచ్చిన పాములు, కలుగుల్లోంచి పైకి వచ్చిన పాములన్నీ వరద ప్రవాహంలో చెట్లను చుట్టుకున్నాయి. దీంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఆ పాములు తమను ఎక్కడ కాటు వేస్తాయోనని కలవరపడుతున్నారు.

మంచిర్యాల కాలేజ్‌ రోడ్‌లోని గౌతమేశ్వర ఆలయం దగ్గర ఉన్న చెట్లపై 20 భారీ విషసర్పాలు కనిపించాయి. చెట్ల కొమ్మలపై తిరుగుతున్న వీటిని చూసి స్థానికులు భయపడుతున్నారు. ఆలయం సమీపంలో తొలుత ఒక పామును గుర్తించారు. క్షుణ్ణంగా చెట్లను పరిశీలిస్తే కొమ్మలపై మరికొన్ని పాములు కనిపించాయి.

Snake: బూటులో పాము.. యువ‌తిపై ప‌డ‌గ విప్పి బుస‌లు.. వీడియో వైర‌ల్

వీటిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి జూమ్‌ చేసి చూస్తున్నారు. ఇందులో నాగు పాములున్నాయి. కట్ల పాములున్నాయి. తాడి జెర్రిలున్నాయి. అన్నీ విషపు జాతివే కావడంతో మంచిర్యాల పట్టణ వాసులు భయపడుతున్నారు.