Snake: బూటులో పాము.. యువతిపై పడగ విప్పి బుసలు.. వీడియో వైరల్
పామును పట్టి తీసుకెళ్ళడానికి ఓ యువతి వచ్చింది. బూటులో దాగి ఉన్న పాము బయటకు వస్తూనే పడగ విప్పి బుసలు కొట్టింది. ఆ పామును ఆ యువతి పట్టుకునే క్రమంలో దాదాపు కాటేసినంత పని చేసింది.

Snake
Snake: వర్షాకాలంలో పాములు, పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. అవి ఇంట్లోకి కూడా వస్తుంటాయి. పాములు వచ్చి ఇంట్లో ఏదో చోట ఉంటూ మనిషి ప్రాణాలకు హాని కలిగిస్తుంటాయి. అవి దేనిలో దూరాయో కనిపెట్టడం కూడా కష్టమే. తాజాగా, ఓ వ్యక్తి బూటులో దూరింది ఓ పాము. ఇందుకు సంబంధించిన వీడియోను సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. బూటులో పాము ఉందన్న విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అటవీ శాఖ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు.
salt: అదనంగా ఉప్పు తీసుకునే వారికి అకాల మరణ ముప్పు
దీంతో పామును పట్టి తీసుకెళ్ళడానికి ఓ యువతి వచ్చింది. బూటులో దాగి ఉన్న పాము బయటకు వస్తూనే పడగ విప్పి బుసలు కొట్టింది. ఆ పామును ఆ యువతి పట్టుకునే క్రమంలో దాదాపు కాటేసినంత పని చేసింది. దాని నుంచి ఆ యువతి చాకచక్యంగా తప్పించుకుని ఎట్టకేలకు పట్టుకుని తీసుకెళ్ళింది. ఇంట్లోకి పాములు వస్తే దాన్ని పట్టుకునేందుకు శిక్షణ తీసుకున్న వారిని పిలవాలని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద సూచించారు. ఆయన పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022