Huge Majority : 20 మంది 50వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపు.. కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం

అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

majority

Huge Majority Votes : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు నాయకులు భారీ మెజారిటీతో గెలించారు. 20 మందికి పైగా నాయకులు 50 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. కాగా, ముగ్గురు 80 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మరొకరు 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఇంకొకరు 60 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ 85,576 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్ధిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు 82,308 ఓట్లు, చంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ 81,660 ఓట్లు భారీ మెజారిటీతో గెలుపొందారు.

కూకట్ పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు 70,387 ఓట్లు, నకిరేకల్ లో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 63,839 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫతితాలు ఆదివారం వెల్లడైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

ట్రెండింగ్ వార్తలు