Suryapet
gallery collapses : నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో కలకలం రేగింది. గ్యాలరీ కుప్పకూలడంతో 200 మందికి గాయాలయ్యాయి. 100 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడున్న వారు గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా గ్యాలరీ కూలిపోవడంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. రక్షించాలంటూ..వారు చేసిన రోదనలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. 47వ జాతీయ స్థాయి సబ్ జూ.కబడ్డీ పోటీల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.