Corona : తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,903కి చేరింది.
- bheemraj
- Published On : September 18, 2021 / 09:31 PM IST
Corona (5)
corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 255 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల్లో కరోనా బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 3,903కి చేరింది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 6,63,282కి చేరింది. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 18, 2021) వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.
వైరస్ నుంచి 24 గంటల్లో 329 మంది కోలుకున్నారు. మొత్తం 6,54,230 మంది బాధితులు కోలుకున్నారు. ఇవాళ ఒక్క రోజే 52,244 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 70, ఖమ్మంలో 21, కరీంనగర్‌లో 20 కేసులు నమోదు అయ్యాయి.
Corona : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 5,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్ కేసుల్లో క్షీణత నమోదైంది.
