ప్రజల్లారా జాగ్రత్త : కరోనా రాకాసి..తెలంగాణా @ 39 కరోనా కేసులు

  • Publish Date - March 25, 2020 / 12:53 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు రికార్డవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మెల్లిగా తన పంజా విసురుతోంది. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ఆరుగురిలో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కేసుల సంఖ్య 39కి చేరుకున్నట్లైంది. ఇందులో 38 కేసులు గత 14 రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం.

తాజాగా నమోదైన 6 కేసుల్లో ముగ్గురు ఇతర దేశాల నుంచి వచ్చిన వారు కాగా..ముగ్గురు స్థానికులున్నట్లు తెలుస్తోంది. బాధితులతో కలిసిమెలిసి ఉన్న వారి కుటుంబసభ్యులను స్వీయ నిర్భందనంలో పరిశీనలో ఉంచినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. 

ఇదిలా ఉంటే..కరోనా బాధితులను గుర్తించే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. మంగళవారం ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 30 వేల మంది వైద్య, అంగన్ వాడి సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. అంతర్జాతీయ విమానాలు అన్నీ క్లోజ్ కావడంతో..ఇతర దేశాల నుంచి ఎవరూ రారని, అంతేగాకుండా..అంతర్జాతీయ రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేయడంతో..రాష్ట్రానికి ఎవరూ కొత్తగా రారని సర్కార్ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం రాష్ట్రానికి 19 వేల 313 మంది అంతర్జాతీయ ప్రయాణీకుల నుంచి కచ్చితమైన వివరాలు లభ్యమౌతాయని యోచిస్తోంది. వీరందరూ స్వీయ నిర్భందనలో ఉంటే వైరస్ కట్టడి అవుతుందని భావిస్తూ..అన్నీ శాఖలను అలర్ట్ చేసింది. వచ్చే పది రోజులు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకుల ఆరోగ్య పరీశీలనే లక్ష్యంగా ముందుకెళుతామని వైద్య శాఖ వెల్లడిస్తోంది. 

See Also | వైద్యులను చప్పట్లతో గౌరవించిన మరుసటి రోజే.. కరోనా భయంతో అద్దె ఇళ్ల నుంచి గెంటివేత