5186 New Corona Cases In Telangana
corona cases in Telangana : తెలంగాణలో కరోనా వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 5,186 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 38 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 68,462కు చేరాయి. మొత్తం మృతుల సంఖ్య 2,704కు చేరింది.
వైరస్ బారినపడిన వారిలో 7,994 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కు చేరింది. కరోనా నుంచి మొత్తం 4,21,209 మంది కోలుకున్నారు.
గడిచిన 24 గంటల్లో 69,148 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీలోనే 904 కొత్త కేసులు నమోదయ్యాయి. సిరిసిల్లలో 399, మేడ్చల్ లో 366, నల్గొండలో 317 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.