తెలంగాణాలోని ములుగు జిల్లా వెంకటాపురంలో దారుణం జరిగింది. భూమి కోసం వచ్చిన గొడవల్లో సొంత వదినపై దాడికి దిగాడు మరిది. ఓ వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమె తలపై ఇనుప రాడ్డుతో దాడిచేశాడు బంధువు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయ్యింది. పొలం పంపకాల విషయంలో కొద్ది కాలంగా రెండు కుటుంబాల మధ్యా గొడవలు జరుగుతున్న క్రమంలో ఈరోజు పొలంలోనే వృద్ధురాలు వదినపై మరిది కృష్ణమూర్తి ఇనుపరాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. ఆమె తలపై బలంగా రాడ్డుతో కొట్టటంతో తీవ్రంగా గాయలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
దీంతో తన భూమిని కాజేయటానికి మరిది కుట్ర పన్నాడని అర్థం చేసుకున్న లక్ష్మీ నీ డబ్బు నువ్వు తీసేసుకో నా భూమి నాకు తిరిగి ఇచ్చేమని బతిమాలింది. కానీ మరిది ఒప్పుకోలేదు. దీంతో తన భూమిలో పనులు చేసుకోవటానికి ఈరోజు లక్ష్మి పొలానికి వెళ్లి దున్నుతుండగా మరిది కృష్ణమూర్తి ఆగ్రహంతో ఊగిపోతూ పొలానికి వచ్చాడు.
వదినతో ఘర్షణ పడ్డాడు. ఈ భూమి నాది నువ్వెలా దున్నుకుంటావంటూ ఓ ఇనుపరాడ్డుతో వదినపై దాడి చేశాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమెను ఈడ్చిపడేశాడు. రాడ్డుతో దాడి చేశాడు. అక్కడే ఉన్న కొంతమంది బంధువులు..స్థానికులు కృష్ణమూర్తిని అడ్డుకున్నాడు. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయాలవ్వటంతో సమీప బంధువులు..స్థానికులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
కాగా..తన భూమి కోసం మరిది కుట్ర పన్నుతున్నాడని తెలిసిన లక్ష్మి న్యాయపోరాటం చేసింది. భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ తో పంచాయితీ పెద్దల దగ్గరకు వెల్లింది. దీంతో వారు కూడా భూమి లక్ష్మిదేనని తేల్చారు. కానీ మరిది వినలేదు. భూమిని అప్పగించలేదు. దీంతో లక్ష్మీ తహశీల్దారు వద్దకెళ్లి డాక్యుమెంట్స్ చూపించింది. తహశీల్దారు కూడా లక్ష్మికే భూమి చెందుతుందని చెప్పినా మరిది మాత్రం భూమి అప్పగించేది లేదని తేల్చిచెప్పాడు.దీంతో లక్ష్మి తన న్యాయపోరాటాన్ని కొనసాగిస్తూ కోర్టుకెళ్లింది. కోర్టుకూడా ఆ భూమి లక్ష్మికే చెందుతుందని తేల్చి చెప్పటంతో ఈరోజు లక్ష్మి తన భూమిలో సాగు చేసుకోవటానికి వెళ్లగా అది తెలిసిన మరిది కృష్ణమూర్తి ఇనుపరాడ్డుతో వదినపైదాడికి పాల్పడ్డాడు.