Telangana Dharani Portal : ధరణి పోర్టల్ ఉద్యోగుల అక్రమాలు.. డిజిటల్ సంతకాలతో భారీగా భూముల బదలాయింపులు

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి పోర్టల్ ఉద్యోగుల అక్రమాలు బయటపడ్డాయి. డిజిటల్ సంతకాలతో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లుగా వెలుగులోకి వచ్చింది.

Dharani portal employees arrested

Dharani portal employees arrested : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ధరణి పోర్టల్ ఉద్యోగుల చేతివాటం బయటపడింది. డిజిటల్ సంతకాలతో ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లుగా తాజాగా వెలుగులోకి వచ్చింది. కలెక్టర్ తో పాటు స్థానిక అధికారులు సైతం ఎన్నికల డ్యూటీలో ఉన్న సమయంలో ఇదే అదను అనుకున్నారో ఏమోగానీ..ఇద్దరు ఉద్యోగులు అక్రమాలకు తెరతీశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించి ధరఖాస్తుల్ని పోర్టల్ నుంచి తొలిగించేశారు.

28 రోజుల్లో 90కి పైగా దరఖాస్తులను నిషేధిత లిస్టు నుంచి తొలగించినట్లుగా బయటపడింది. భారీ స్థాయిలో భూముల బదాలాయింపులకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఈ అక్రమాలకు పాల్పడిన ధరణి పోర్టల్ ఉద్యోగులపై అధికారులు వేటు వేశారు. అనంతరం అధికారులు ఈ క్రమాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు.

కాగా.. ధరణి పోర్టల్ అంశంపై తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ధరణి పోర్టల్ అంతా ఓ అక్రమాల పుట్ట అంటూ విమర్శించింది. ధరణి పోర్టల్ వల్ల రైతులకు నష్టం కలుగుతోందని ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ స్థానంలో భూమాతను తెస్తున్నామని వెల్లడించిన విషయం తెలిసిందే. పేదల భూములను ధరణి పేరుతో మళ్లించారని ఆరోపించారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.

చకా చకా హామీల అమలు…తొలిరోజే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నిన్ననే కాంగ్రెస్ పార్టీ కొలువుతీరింది. బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండో రోజునే ధరణి పోర్టల్ లో భూ భాగోతాలు బయటపటం గమనించాల్సిన విషయం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

అనంతరం విద్యుత్ శాఖపై దష్టి పెట్టారు. సమీక్ష నిర్వహించారు. ఈక్రమంలో విద్యుత్ శాఖలో అవకతవకలు జరిగాయని మండిపడ్డారు. దీంట్లో భాగంగా ఈరోజు మరోసారి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు