Karimabad High School
Karimabad High School : వరంగల్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాకం బయటపడింది. 9వ తరగతి జవాబు పత్రాలను 8వ తరగతి విద్యార్థులు మూల్యాంకనం చేస్తున్నారు. కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. టీచర్లు సొంత పనులు చేసుకుంటూ విద్యార్థులతో మూల్యాంకనం చేయిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విషయం గమనించి విద్యార్థులను నిలదీశారు పేరెంట్స్.
8వ తరగతి విద్యార్థులతో 9వ తరగతి ఆన్సర్ షీట్లను కరెక్షన్ చేయించిన వ్యవహారం దుమారం రేపింది. అందరినీ విస్మయానికి గురి చేసింది. టీచర్ల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
కరీమాబాద్ ప్రభుత్వ పాఠశాల వరంగల్ నగరంలో ఉంటుంది. ఇక్కడ టీచర్ల నిండు నిర్లక్ష్యం బట్టబయలైంది. 8వ తరగతి విద్యార్థులతో 7వ తరగతి, 9వ తరగతి విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను కరెక్షన్(మూల్యాంకనం) చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన టీచర్లు సొంత పనులు చూసుకోవడంలో మునిగిపోయారు. స్వయంగా ఎంతో జాగ్రత్తగా తాము చేయాల్సిన పనిని విద్యార్థులకు అప్పగించేశారు.
8వ తరగతికి చెందిన కొంతమంది విద్యార్థులకు ఆన్సర్ షీట్లను కరెక్షన్ చేసే పని అప్పగించారు. ఈ వ్యవహారం చాలా వివాదాస్పదమైంది. 9వ తరగతి విద్యార్థులకు చెందిన బయో సైన్స్ ఆన్సర్ పేపర్లను 8వ క్లాస్ స్టూడెంట్స్ తో కరెక్షన్ చేయించారు టీచర్లు. దీన్ని కొందరు తల్లిదండ్రులు గమనించి షాక్ అయ్యారు. వెంటనే స్కూల్ లోనికి వెళ్లి టీచర్లను నిలదీశారు.
Also Read..TS EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల… మే 7 నుంచి పరీక్షలు ప్రారంభం
టీచర్లు చేయాల్సిన పనిని విద్యార్థులతో ఎందుకు చేయిస్తున్నారు అని ప్రశ్నించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని టీచర్లను నిలదీశారు. ఊహించని పరిణామం ఎదురుకావడంతో టీచర్లు కంగుతిన్నారు. పేరెంట్స్ నిలదీసేసరికి వారు బెంబేలెత్తిపోయారు. దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.