Nagarkurnool Incident: వర్షాలు పడటం లేదని.. శవాన్ని బయటకు తీశారు.. నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ సంఘటన

నాగర్‌కర్నూల్(Nagarkurnool Incident) జిల్లా పరిధిలో ఇటీవల వెలుగుచూసిన ఒక షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

A buried body was exhumed and cremated to bring rain In Nagarkurnool

  • శవం వెలికితీత
  • వర్షాల కోసమంటూ వింత ఆచారం
  • రంగంలోకి దిగి విచారణ జరుపుతున్న పోలీసులు

Nagarkurnool Incident: నేటి ఆధునిక కాలంలో సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఇంకా స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వర్షాలు కురవక పంటలు ఎండిపోతున్న సమయంలో గ్రామస్తులు కొన్నిసార్లు వింత, దారుణమైన నమ్మకాలను ఆశ్రయిస్తుంటారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలో ఇటీవల వెలుగుచూసిన ఒక షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. గ్రామంలో వానలు పడకపోవడానికి కొద్ది నెలల క్రితం మరణించిన ఒక వ్యక్తి మృతదేహమే కారణమనే అపోహతో, గ్రామస్థులంతా కలిసి దారుణమైన చర్యకు ఒడిగట్టడం అందరినీ తీవ్ర విస్మయానికి గురిచేసింది.

Aarogyasri: పేద ప్రజలకు గుడ్ న్యూస్.. ఆరోగ్య శ్రీలోకి అదనపు చికిత్సలు.. పరిమితి రూ.10 లక్షలకు పెంపు

జెసిబితో వెలికితీసి పెట్రోల్ పోసి దహనం

నాగర్‌కర్నూల్ జిల్లా(Nagarkurnool Incident) పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సుమారు మూడు నెలల క్రితం మృతిచెందగా, కుటుంబసభ్యులు ఆ మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, అప్పటినుంచి ఊరిలో సరిగ్గా వర్షాలు పడకపోవడానికి ఆ ఖననమే కారణమని గ్రామస్థులు మూఢంగా భావించారు. దీంతో ఊరి వారంతా ఏకమై జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం కట్టెలు పేర్చి, పెట్రోల్ పోసి అక్కడికక్కడే దహనం చేశారు. ఈ వింత ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు విచారణ ప్రారంభించారు.