TGPSC: నిరుద్యోగులకు TGPSC బిగ్ షాక్.. 544 ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు.. కమిషన్ కీలక ప్రకటన
2022 లో విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్(TGPSC)ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రైవేట్ వెబ్ నోట్ ద్వారా కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
TSPSC cancelled the recruitment notification for degree college lecturers and librarians.
- పాత లెక్చరర్ నోటిఫికేషన్ రద్దు
- 544 పోస్టుల నియామకం రద్దు
- త్వరలో నూతన రోస్టర్ నోటిఫికేషన్
TGPSC: తెలంగాణలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఒక కీలకమైన సమాచారాన్ని వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కళాశాలల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టుల భర్తీ కోసం గతంలో 2022 డిసెంబర్ నెలలో విడుదల చేసిన బ్రీఫ్ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రైవేట్ వెబ్ నోట్ ద్వారా కమిషన్ అధికారికంగా ప్రకటించింది.
544 పోస్టుల రద్దు.. త్వరలోనే కొత్త నోటిఫికేషన్:
గతంలో 544 ఖాళీల భర్తీకి ఇచ్చిన ఈ బ్రీఫ్ నోటిఫికేషన్‌పై సమగ్రంగా చర్చించి, అన్ని అంశాలు, న్యాయపరమైన పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం కమిషన్ అధికారిక వెబ్సైట్ https://www.tgpsc.gov.in/ ని సందర్శించాలని సూచించారు.
