Peddapalli
Peddapalli : పెద్దపల్లి జిల్లాలోని మంథని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్‌పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు, కారును ఢీకొని పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మరణించగా.. బస్సులో ఉన్న వారిలో 16 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
Read More : నా చావుకి కారణం అజితే.. హీరో ఇంటి ఎదుటే మహిళ ఆత్మహత్యాయత్నం!
స్థానికుల ద్వారా ప్రమాద విషయం తెలుసుకున్న మంథని పోలీసులు ఘటన స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో బస్సుని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా పరకాల డిపోకు చెందిన బస్సు బెల్లపల్లి నుంచి హన్మకొండ వెళ్తున్న క్రమంలో గాడిదులగండి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన వ్యక్తిని ఖాన్‌సాయిపేటకు చెందిన వినీత్‌గా గుర్తించారు.
Read More : ఒక ప్రియురాలు, ఇద్దరు ప్రియులు……!