Woman Dance at Metro: నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమతమ గమ్య స్థానాలకు చేరేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉంటున్నాయి. అయితే ఓ యువతి అమీర్పేట మెట్రో స్టేషన్ లో హల్ చల్ చేసింది. తెలుగు, హిందీ పాటలకు డ్యాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఈ ఘటనపై హెచ్ఎంఆర్ అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు యువతిపై చర్యలు తీసుకొనేందుకు సిద్ధమైయ్యారు. రద్దీగా ఉండే మెట్రో స్టేషన్ లో ఇష్టారీతిలో వ్యవహరిస్తూ డ్యాన్స్ చేసిన యువతిపై పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ యువతి మెట్రోలోకి ఎక్కిన తరువాతసైతం తన డ్యాన్స్ ను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే అందమైన యువతి కావటం, పైగా మోడ్రన్ దుస్తుల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేయడంతో సోషల్ మీడియాలో యువతి డ్యాన్స్ ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నాయి.