Ghatkesar: ఛీ.. ఛీ.. వీడసలు మనిషేనా.. కన్నతల్లిపైనే లైంగిక దాడి.. నోట్లో గుడ్డలు కుక్కి..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌(Ghatkesar)లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

A son sexually assaulted his own mother in Ghatkesar, Hyderabad

  • కన్నతల్లిపైనే కన్నకొడుకు అత్యాచారం!
  • నోట్లో గుడ్డలు కుక్కి..
  • ఘట్‌కేసర్‌లో నరరూప రాక్షసుడు!

Ghatkesar: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో సభ్యసమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నప్రేమను, కనీస విచక్షణను మరిచిన ఒక కుమారుడు కన్నతల్లిపైనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. నవమాసాలు మోసి పెంచిన తల్లిపైనే ఓ యువకుడు మృగంలా ప్రవర్తించిన ఈ ఘోరకలి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Telangana Pensioners: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్ షాక్.. ఒక్క క్లిక్‌తో లక్ష పెన్షన్లు కట్.. ఊహించని నిర్ణయం తీసుకున్న సర్కార్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 56 ఏళ్ల మహిళ జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వలసవచ్చింది. ఘట్‌కేసర్‌(Ghatkesar)లోని ఒక భవనం సెల్లార్‌లో నివసిస్తూ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె మొదటి భర్తకు జన్మించిన రెండో కుమారుడు విజయ్ (25) గత రెండు నెలలుగా తల్లి వద్దే ఉంటున్నాడు. అయితే, విజయ్ తరచూ మద్యం సేవించి వచ్చి తల్లితో గొడవపడుతూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడు.

ఈ క్రమంలోనే జూలై 3వ తేదీ సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన విజయ్, మరోసారి తల్లితో గొడవపడి రాత్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఆమె మెడకు విద్యుత్ తీగ వేసి బెదిరించాడు. అంతేకాకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి మరోమారు పైశాచికత్వానికి ఒడిగట్టాడు. ఈ ఘోరంపై బాధితురాలు ధైర్యంగా ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.