Telangana Pensioners: తెలంగాణ పెన్షన్ దారులకు బిగ్ షాక్.. ఒక్క క్లిక్‌తో లక్ష పెన్షన్లు కట్.. ఊహించని నిర్ణయం తీసుకున్న సర్కార్
తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల(Telangana Pensioners) పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, అర్హులకు మాత్రమే న్యాయం చేయడమే లక్ష్యంగా కీలకమైన అడుగులు వేస్తోంది.
Telangana government to remove ineligible pensions and add three lakh new pensions
- లక్ష మంది అనర్హుల తొలగింపు
- మూడు లక్షల కొత్త పెన్షన్లు
- లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ వేగవంతం
Telangana Pensioners: తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు, అర్హులకు మాత్రమే న్యాయం చేయడమే లక్ష్యంగా కీలకమైన అడుగులు వేస్తోంది. సాంకేతికతను జోడించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లైవ్ అథెంటికేషన్’ ప్రక్రియ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వేగవంతమైంది. ఈ సరికొత్త విధానం ద్వారా అనర్హులను ఏరివేస్తూ, నిజమైన పేదలకు లబ్ధి చేకూర్చేలా అధికారులు క్షేత్రస్థాయిలో ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు.
ఈ లైవ్ అథెంటికేషన్, క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా రాష్ట్రంలో దాదాపు లక్ష మందికి పైగా అనర్హులు పెన్షన్లు(Telangana Pensioners) పొందుతున్నట్లు ప్రభుత్వం తాజాగా గుర్తించింది. మరణించిన వారి పేరిట ఇంకా పెన్షన్లు డ్రా చేయడం, ఒకే ఇంట్లో ఇద్దరు పొందడం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక స్థోమత ఉన్నప్పటికీ లబ్ధి పొందడం వంటి అక్రమాలను ఈ విధానం ద్వారా పట్టుకున్నారు. ఈ అనర్హుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి శాశ్వతంగా తొలగించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
అనర్హుల తొలగింపు ద్వారా మిగిలే నిధులను కొత్తగా అర్హులైన వారికి మళ్లించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం సుమారు 2 లక్షల మంది అర్హుల గుర్తింపు ప్రక్రియ ముగింపు దశకు చేరింది. దీనికి అదనంగా.. ఇప్పుడు తాజాగా తొలగించబోయే లక్ష మంది స్థానంలో మరో లక్ష మంది కొత్త అర్హులను ఎంపిక చేయనున్నారు. ఫలితంగా రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు అందుకోబోయే లబ్ధిదారుల సంఖ్య ఏకంగా మూడు లక్షలకు చేరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
