Panipuri Case: అసలు నమ్ముతారా ఇది.. ఒక్క పానీపూరీ కోసం 12 ఏళ్ల కేసు.. కోర్టు తీర్పు చూసి నెటిజన్లు షాక్..
కేవలం ఒకే ఒక్క పానీపూరీ(Panipuri Case) కోసం జరిగిన వివాదం ఏకంగా 12 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Verdict in Haryana Panipuri case after 12 years of trial
- ఒక్క పానీపూరీ.. 12 ఏళ్ల కేసు!
- ఐదు రూపాయల ఘోర వినాశనం!
- తీర్పు చూసి జనాలు షాక్!
Panipuri Case: కేవలం ఒకే ఒక్క పానీపూరీ కోసం జరిగిన వివాదం ఏకంగా 12 ఏళ్లపాటు కోర్టు మెట్లు ఎక్కడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆస్తులు, ఆర్థిక గొడవలతో కోర్టులు నిండిపోతున్న ప్రస్తుత కాలంలో, ఐదు రూపాయల పానీపూరీ గొడవ న్యాయస్థానం వరకు వెళ్లడం నెటిజన్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
హరియాణాలో 2014లో ఒక వ్యక్తి పానీపూరీ (Panipuri Case)తినడానికి వెళ్లినప్పుడు, వ్యాపారి ఐదు రూపాయలకు నాలుగు పానీపూరీలు మాత్రమే ఇచ్చాడు. చుట్టుపక్కల వారు ఐదు ఇస్తుంటే నువ్వెందుకు నాలుగే ఇస్తున్నావని కస్టమర్ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా, ఈ వివాదం కోర్టుకు చేరింది.
ఈ చిన్న గొడవను తేల్చడానికి న్యాయస్థానానికి 12 ఏళ్ల సమయం పట్టగా, ఈ లోపు 15 మంది సాక్షులను విచారించారు. చివరకు బలమైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది. చిన్న విషయాల్లో సహనం లేకపోతే ఎంతటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి, కోర్టు సమయాన్ని వృధా చేసిన ఈ విచిత్ర ఘటనే ఒక పెద్ద ఉదాహరణ.
