×
Ad

Youngster Suicide : ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి

ఐపీఎల్ బెట్టింగ్ ల కోసం విజయ్ అప్పులు చేశాడు. పదే పదే అప్పులు చేసి అప్పుల పాలయ్యాడు.

  • Published On : May 16, 2022 / 12:01 PM IST

Betting

young man suicide : బెట్టింగ్ లు యువకుల ప్రాణాలు తీస్తున్నాయి. బెట్టింగ్ లకు అలవాటు పడ్డ కొంతమంది అప్పులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఐపీఎల్ బెట్టింగ్ కు యువకుడు బలి అయ్యాడు. బెట్టింగ్ లో అప్పులపాలైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఘటన చోటు చేసుకుంది. మృతుడు మోతుకూరు విజయ్ గా గుర్తించారు. ఐపీఎల్ బెట్టింగ్ ల కోసం విజయ్ అప్పులు చేశాడు. పదే పదే అప్పులు చేసి అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చాలంటూ విజయ్ పై అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు.

Loan Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం-వ్యక్తి ఆత్మహత్య

దీంతో విజయ్ అప్పులు తీర్చలేకపో్యాడు. వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.