Loan Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్ల దాష్టీకం-వ్యక్తి ఆత్మహత్య
ముంబైలోని కురార్ పోలీసు స్టేషన్ పరిధిలోని తూర్పు మలద్ ప్రాంతానికి చెందిన సందీప్ కోరెగోంకర్(38) అనే వ్యక్తిని లోన్ రికవరీ ఏజెంట్లు లోన్ కట్టాలని వేధించారు.

Loan App Recovery Agents Harassment
Loan Recovery Agents : లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కడో ఒకచోట లోన్ యాప్ సిబ్బంది ఆగడాలు, అకృత్యాలు వినిపిస్తూనే ఉన్నాయి. ముంబైలోని కురార్ పోలీసు స్టేషన్ పరిధిలోని తూర్పు మలద్ ప్రాంతానికి చెందిన సందీప్ కోరెగోంకర్(38) అనే వ్యక్తిని లోన్ రికవరీ ఏజెంట్లు లోన్ కట్టాలని వేధించారు.
తీసుకోని రుణాన్ని చెల్లించాలని లోను రికవరీ ఏజెంట్లు తన సోదరుడ్ని వేధించారని సందీప్ సోదరుడు ఆరోపించాడు. లోన్ రికవరీ ఏజెంట్లు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బాధితుడికి 50 సార్లకు పైగా పోన్ చేసి వేధించారని బాధితుడి సోదరుడు వివరించాడు. లోన్ కట్టక పోవటంతో రికవరీ ఏజెంట్లు బాధితుడి న్యూడ్ ఫోటోలను అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న బంధువులు, స్నేహితుల నెంబర్లకు పంపించారు.
ఏప్రిల్ 24వ తేదీన బాధితుడు తన సోదరుడు దత్తగురుకు ఫోన్ చేసి తాను ఎవరి వద్ద లోన్ తీసుకోలేదని…..అయినా ఇన్ స్టాంట్ లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు తనను వేధిస్తున్నారని చెప్పి భోరున విలపించాడు. ఏప్రిల్ 27 న ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.
మే 4వ తేదీ బుధవారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాధితుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కురార్ పోలీసు స్టేషన్ సిబ్బంది నిందుతులపై ఐపీసీ సెక్షన్ 306, 420,500, ఐటీ యాక్ట్ సెక్షన్ 66(డీ)కింద కేసు నమోదు చేసారు. నిందితులు ఫోన్ చేసిన ఆరు మొబైల్ నెంబర్లు ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.
Also Read : Cheddi Gang : చెడ్డీగ్యాంగ్‌లో కీలక నిందితుడు అరెస్ట్