young man married second wife
Hyderabad Young Man Married Second Wife : హైదరాబాద్ లో పెళ్లైన రెండు వారాలకే భార్య.. భర్తకు మరో యువతితో వివాహం చేశారు. మొదటి భార్య సాక్షిగా యువకుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కరజాడ గాంధీ (23) తెలంగాణలోని హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని సింగాడకుంటలో నివాసముంటున్నాడు. కేజీ ఫిల్మ్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ చానెల్స్ లో డ్యాన్స్ వీడియోల్లో నటిస్తాడు.
2020లో యూసుఫ్ గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ నృత్యం నేర్చుకునే సమయంలో అక్కడికి శిక్షణ కోసం వచ్చిన యువతి (20)తో గాంధీకి పరిచయం ఏర్పడింది. గాంధీ యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. కానీ, వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
ఆ తర్వాత బాధిత యువతిని పెళ్లి చేసుకునేందుకు గాంధీ నిరాకరించాడు. దీంతో ఆమె 6 నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మోసం చేసిన గాంధీపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో యువతితో అతడికి సంబంధం ఉందని, అందుకే తనను పెళ్లి చేసుకోవడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. మరో యువతితో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె కేవలం తన స్నేహితురాలు మాత్రమే అంటూ గాంధీ బుకాయించాడు.
కేసు వెనక్కి తీసుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి.. 6 నెలల క్రితం ఆమెను తన గదికి తీసుకెళ్లి తాళి కట్టాడు. అయితే ఆమెకు తాళికట్టే సమయంలో రెండో యువతి కూడా అక్కడే ఉండి పెళ్లి జరిపించారు.
ఈ నేపథ్యంలో పెళ్లైన తర్వాత కొన్నాళ్ల పాటు బాగానే ఉన్న గాంధీ తరచూ బాధితురాలిని కొడుతున్నాడు. అంతేకాకుండా ఇంటికి ఆలస్యంగా రావడం, కొన్నిసార్లు రాత్రి పూట షూటింగ్ ఉందంటూ రాకపోవడం చేశాడు.
Girl Assault : పెద్దపల్లి జిల్లాలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్, హత్య
దీంతో అనుమానం వచ్చిన బాధిత యువతి ఆరా తీయగా తనను పెళ్లి చేసుకోవడానికి రెండు వారాల ముందే వేరే యువతిని గాంధీ పెళ్లి చేసుకున్నాడని, కేసు నుంచి తప్పించుకోవడం కోసమే గాంధీ, ఆ యువతితో కలిసి ఈ పెళ్లి నాటకం ఆడి మోసం చేశారని గుర్తించారు. ఇద్దరు కలిసి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12 లో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారని తెలుసుకున్న బాధిత యువతి మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లి గాంధీని నిలదీసింది.
తనకు రెండో యువతితో ఉండటమే ఇష్టమని, బాధిత యువతితో ఉండటం ఇష్టం లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్తతో పాటు మరో యువతిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.