హరీశ్ రావు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా?: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బీఆర్ఎస్ సినిమా అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని తెలిపారు.

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు గతంలో కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హరీశ్ రావు కలిసి కాంగ్రెస్ లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా అని నిలదీశారు.

హరీశ్ ప్రయత్నాలు కేసీఆర్ కి తెలిసి ఆయనను దూరం పెట్టలేదా అని అన్నారు. కేసీఆర్ కోప్పడడం వల్ల హరీశ్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీశ్ రావుకు ఎక్కడిదని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ సినిమా అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని తెలిపారు. రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయిందని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీశ్ రావు కండ్లలో నిప్పులు పోసుకుని మాట్లాడుతున్నారని అన్నారు.

పదేండ్లలో రైతులకు 80 వేల కోట్లు వేశామని హరీశ్ అబద్ధాలు చెబుతున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. తాము పది మాసాలలో 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని, వాగులు, వంకలు, కొండలు, కొనలకు గత ప్రభుత్వం రైతుబంధు వేసిందని చెప్పారు.

తాము కౌలు రైతులకు సైతం బోనస్ ఇచ్చామని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చేలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని చెప్పారు. గత పదేండ్లలో ఒక్క డీఏస్సీ కూడా వేయలేదని, కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా? వ్యతిరేకమా? అని అన్నారు.

Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ