Raghavendra Rao Arrest: వనమా రాఘవేంద్ర రావు అరెస్ట్!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

  • Updated on- January 6, 2022 / 04:18 PM IST

Vanama

Raghavendra Rao Arrest: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసు తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు కారణమని ఆరోపిస్తూ.. బాధితుడు తీసిన సెల్ఫీ విడీయో బ‌య‌ట‌కొచ్చిన తర్వాత.. రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎమ్మెల్యే కొడుకు అయి ఉండి, ఇంతటి నీచానికి పాల్పడుతాడా? అంటూ ఎమ్మెల్యే రాజీనామాకు కూడా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రతిప‌క్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఈ క్రమంలోనే వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేశారు కొత్తగూడెం పోలీసులు.

Vistara sale Offer: రూ. 977కే విమాన ప్రయాణం.. 48 గంటల్లోనే!

వనమా రాఘవేంద్ర రావుపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెయిల్‌కు అప్లై చేసినా కూడా రాకుండా కౌంటర్ దాఖలు చేస్తామని అంటున్నారు పాల్వంచ ASP. మరోవైపు రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని స్పష్టం చేశారు.

Tollywood : సినీ పరిశ్రమలో కొత్త వారసులు.. అల్లుళ్లదే హవా

కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 3వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్యలు ఆత్మహత్య చేసుకొన్నారు. తన ఆత్మహత్యకు వనమా రాఘవేంద్ర రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోగా.. అది బయటకు వచ్చింది.