Tollywood : సినీ పరిశ్రమలో కొత్త వారసులు.. అల్లుళ్లదే హవా

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వచ్చారు. కాని ఇటీవల అల్లుళ్ళు వారసులుగా వస్తున్నారు. కొంతమంది స్టార్స్ అల్లుళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే మరి..........

Tollywood : సినీ పరిశ్రమలో కొత్త వారసులు.. అల్లుళ్లదే హవా

Tollywood Heros

Tollywood :  సినీ పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి చాలా మంది హీరోలు రావడం కొత్తేమి కాదు. సినిమా పరిశ్రమ మొదలు నుంచి ఉన్నదే. ఒకే ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. వాళ్ళకి వారసులు వస్తున్నారు. ఎక్కువగా వారసులు అంటే కొడుకులే వస్తారు. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా వచ్చారు. కాని ఇటీవల అల్లుళ్ళు వారసులుగా వస్తున్నారు. కొంతమంది స్టార్స్ అల్లుళ్ళు ఇప్పటికే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే మరి కొంతమంది ఇప్పుడిప్పుడే ఎంట్రీ ఇస్తున్నారు.

AP Cinema Ticket Rates : సినిమా టికెట్ రేట్ల గురించి చాలా మాట్లాడాలి.. సపరేట్‌గా ప్రెస్‌మీట్ పెడతాను

సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ఎప్పుడో ఇండస్ట్రీలో అడుగుపెట్టి వరుస సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరో అవ్వకపోయినా డిఫరెంట్ కాన్సెప్టులతో మంచి మంచి సినిమాలు తీస్తూ వెళ్తున్నాడు.

మెగా కాంపౌండ్ లో చిరంజీవి మేనల్లుళ్లు సాయి తేజ్ – వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లో తమ సత్తా చూపిస్తున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక వైష్ణవ తేజ్ మొదటి సినిమాతోనే పెద్ద హిట్ సాధించి ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయితే ఒక్క పెద్ద హిట్ సినిమా కూడా పడలేదు. ఈ సంక్రాంతికి ‘సూపర్ మచ్చి’ సినిమాతో రాబోతున్నాడు. మెగా బ్రాండ్ ఉన్నా కూడా వాడుకోకుండానే ముందుకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు.

ఇక స్టార్ కెమెరామ్యాన్ చోటా కే నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ ఇప్పటికే హీరోగా సెటిల్ అయి కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. నిర్మాతగా కూడా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు సందీప్ కిషన్.

ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ ఈ సంక్రాంతికి `హీరో` సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇలా ఇప్పటికే మరి కొంతమంది స్టార్లు కూడా తమ అల్లుళ్ళని హీరోలుగా చేయడానికి రెడీ అవుతున్నారట.

Rana Daggubati : శింబు ‘మానాడు’ సినిమాని రీమేక్ చేయబోతున్న రానా