Vistara sale Offer: రూ. 977కే విమాన ప్రయాణం.. 48 గంటల్లోనే!

టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ కంపెనీ విస్తారా.. తన కార్యకలాపాలను ప్రారంభించి ఏడేళ్లు పూర్తవుతోంది.

Vistara sale Offer: రూ. 977కే విమాన ప్రయాణం.. 48 గంటల్లోనే!

Vistara Announces "7th Anniversary Offer"

Vistara sale Offer: టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ కంపెనీ విస్తారా.. తన కార్యకలాపాలను ప్రారంభించి ఏడేళ్లు పూర్తవుతోంది. విస్తారా తన ఏడవ వార్షికోత్సవం సందర్భంగా చౌకగా విమాన టిక్కెట్లను అందిస్తోంది. విస్తారా యానివర్శిరీ స్పెషల్ ఆఫర్‌ను ప్రారంభించింది. 2022లో విమానంలో ప్రయాణించాలి అనుకునే ప్రయాణికులు ఈ సేల్ ఆఫర్ కింద చౌకగా విమాన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

విస్తారా ఆఫర్ సేల్ 48 గంటలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ జనవరి 6వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ప్రారంభమై జనవరి 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. విమాన ప్రయాణికులు జనవరి 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు సేల్ ఆఫర్‌లో విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. విస్తారా ఆఫర్ 48 గంటలు మాత్రమే ఉంటుంది.

ఈ సేల్ ఆఫర్‌లో, అంతర్జాతీయ ప్రయాణానికి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ రూట్‌ల కోసం, ప్రస్తుతం బుకింగ్ యాక్టివ్‌గా ఉన్న రూట్‌లను ఎంచుకోవచ్చు. ఈ సేల్ ఆఫర్‌లో ఎకానమీ క్లాస్‌ ఆల్ ఇన్‌క్లూజివ్ ఎయిర్ టిక్కెట్‌ల వన్-వే ధర రూ.977 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రీమియం ఎకానమీ క్లాస్‌కి విమాన ఛార్జీలు రూ. 2,677 నుంచి బిజినెస్ క్లాస్‌కు రూ. 9,777 నుంచి ప్రారంభం అవుతున్నాయి.

ఎకానమీ, ప్రీమియం ఎకానమీ క్లాస్ టిక్కెట్లను డొమెస్టిక్ ఫ్లైట్ కోసం 15రోజుల ముందుగా బిజినెస్ క్లాస్ కోసం 3 రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలి. అయితే, అంతర్జాతీయ రూట్లలో ప్రీ-బుకింగ్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం లేదు. విస్తారా వెబ్‌సైట్ www.airvistara.comని సందర్శించడం ద్వారా టిక్కెట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు iOS, Android మొబైల్ యాప్‌లలో కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

యానివర్సరీ స్పెషల్ సేల్‌లో విస్తారా ఎయిర్‌పోర్ట్ టిక్కెట్ ఆఫీసులు, ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌లు, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు మరియు ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.