ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్

భూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

Additional Collector Arrest : ఆయన అడిషనల్ కలెక్టర్. ఉన్నత పదవి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన అధికారి. అలాంటి ఆఫీసరే అడ్డదారిలో వెళ్లాడు. ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదో.. ఏమో.. లంచాలకు రుచి మరిగాడు. చివరికి అడ్డంగా దొరికిపోయాడు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. 16 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డి ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు.

లంచం కేసులో ఘట్‌కేసర్ సబ్‌రిజిస్ట్రార్ సస్పెండ్..
అటు మరో అవినీతి అధికారి సస్పెండ్ అయ్యాడు. లంచం తీసుకున్నట్టు తేలడంతో మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ హనుమంతరావును సస్పెండ్ చేశారు. వారం రోజుల క్రితమే పటాన్ చెరు నుంచి ఘట్ కేసర్ కు బదిలీపై వచ్చారు హన్మంతరావు. 2 రోజులు ఆలస్యంగా విధుల్లో చేరారు.
ఈ నెల 9వ తేదీ వరకు నాలుగు రోజులపాటు విధులు నిర్వహించారు. అదే రోజు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని రెండు రోజులు గోప్యంగా ఉంచారు. గతంలో పటాన్ చెరు పని చేసినప్పుడు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న కేసులో విచారణ జరిపిన ఉన్నతాధికారులు.. హన్మంతరావును సస్పెండ్ చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు