MLC Vanidevi car accident : ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు యాక్సిడెంట్

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. అసెంబ్లీలో ఆమె కారుకు ప్రమాదానికి గురైంది.

Accident To Mlc Surabhi Vanidevi Car

accident to MLC Surabhi Vanidevi car : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు యాక్సిడెంట్‌ జరిగింది. అసెంబ్లీలో ఆమె కారుకు ప్రమాదానికి గురైంది. గేట్ నెంబర్‌ 8 దగ్గర పార్కింగ్ చేస్తుండగా వాణీదేవి వాహనం కంట్రోల్ తప్పి గేట్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. అయితే ప్రమాద సమయంలో ఎమ్మెల్సీ వాణీదేవి వాహనంలో లేరని అసెంబ్లీ అధికారులు తెలిపారు.

వాణిదేవిని అసెంబ్లీ వద్ద డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే వాహానాన్ని డ్రైవర్ కాకుండా గన్‌మన్ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైన గన్‌మన్ భానుప్రకాశ్‌ను సీపీ అంజనీకుమార్ సస్పెండ్ చేశారు.