Gaddar Padma Nomination Row: రాజకీయ ప్రయోజనాలే మీకు ముఖ్యం అంటూ.. బండి పై అద్దంకి ఫైర్.. ఇంకా ఏమి అన్నాడంటే..

గద్దర్ కి పద్మ అవార్డు బరాబర్ ఇవ్వం.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత అద్దంకి దయాకర్ ఏమని స్పందించారంటే..?

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుండి గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమలరావు వంటి ప్రముఖులకు పద్మ అవార్డు లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన కేంద్రం ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ఇదే విషయాన్ని యూనియన్ మినిస్టర్ బండి సంజయ్ వద్ద ప్రస్తావించగా ‘‘పద్మ అవార్డులు స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్ కు ఎలా ఇస్తాం..? అయన భావజాలం ఏంటి..? బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం..? మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు.. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం.. బరాబర్ ఇవ్వం’’ అంటూ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు అద్దంకి దయాకర్ ఏమి అన్నాడంటే..గద్దర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి అని మీకు తెలియదా..? అయినా మీ రాజకీయ ప్రయోజనాలే కనబడతాయి మీకు అంటూ ఫైర్ అయ్యారు. పూర్తి వివరాలకు కింద ఉన్న వీడియో ని చూడండి..
https://www.youtube.com/watch?v=f3CF1DSO2ac