Adulterated Petrol : కల్తీ పెట్రోల్ కలకలం.. పెట్రోల్‌కి బదులు నీళ్లు, షాక్‌లో వాహనదారులు

అసలే పెట్రోల్ ధర భగ్గుమంటోంది. లీటర్ ధర సెంచరీ దాటింది. పెరిగిన ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయినా పెట్రోల్ కొట్టకపోతే బతుకు బండి కదలని పరిస్థితి. ఎలాగో తంటాలు పడి పెట్రోల్ కొట్టిద్దాని వెళితే అక్కడేమో... కల్తీ కలకలం రేపుతోంది. పెట్రోల్ కోసం బంక్ కి వెళితే అక్కడ పెట్రోల్ పంపు నుంచి పెట్రోల్ బదులు ప్యూర్ వాటర్ రావడంతో వాహనదారులు షాక్ తిన్నారు.

Adulterated Petrol : అసలే పెట్రోల్ ధర భగ్గుమంటోంది. లీటర్ ధర సెంచరీ దాటింది. పెరిగిన ధరలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. అయినా పెట్రోల్ కొట్టకపోతే బతుకు బండి కదలని పరిస్థితి. ఎలాగో తంటాలు పడి పెట్రోల్ కొట్టిద్దాని వెళితే అక్కడేమో… కల్తీ కలకలం రేపుతోంది. పెట్రోల్ కోసం బంక్ కి వెళితే అక్కడ పెట్రోల్ పంపు నుంచి పెట్రోల్ బదులు ప్యూర్ వాటర్ రావడంతో వాహనదారులు షాక్ తిన్నారు.

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్ హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో ఈ ఘటన జరిగింది. ఈ బంక్‌లో పెట్రోల్‌ పోయించుకున్న వాహనదారులు కొద్ది దూరం వెళ్లగానే వారి వాహనాలు మొరాయించాయి. బైక్ లో పెట్రోల్ ఉన్నా స్టార్ట్ కావడం లేదు. దీంతో వాహనాలు తోసుకుంటూ తిరిగి బంక్‌ దగ్గరికి వచ్చారు. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే వారికి దిమ్మతిరిగిపోయింది. బంకులో పెట్రోల్‌ బదులు నీళ్లు వస్తున్నాయని, అవే తమ బండిలో పోయించుకున్నామని తెలిసి లబోదిబోమన్నారు. బంక్‌ యజమానిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాహనదారులంతా పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యాన్ని నిలదీయగా ట్యాంక్‌లో వర్షం నీరు చేరడంతో అలా జరిగిందని సమాధానమిచ్చాడు.

పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు బకెట్ల కొద్దీ స్వచ్చమైన నీరు వస్తోంది. ఇది కళ్లారా చూసిన వాహనదారులు కంగుతిన్నారు. పెట్రోల్ పోయమని డబ్బులిస్తే నీళ్లు పోయడం ఏంటని సీరియస్ అయ్యారు. పెట్రోల్ బంకు నిర్వాహాకులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. దీంతో బంకు నిర్వాహాకులు తాత్కాలికంగా బంక్ ని మూసేశారు.

ట్రెండింగ్ వార్తలు