Lawyer Couple
Advocate Vaman Rao Couple Murder Case : హైకోర్టులో వామన్ రావు హత్య కేసు విచారణ జరుగనుంది. ఫిబ్రవరి 17వ తేదీన రామగిరి మండలం కల్వచర్ల వద్ద ప్రధాన రహదారిపై వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన రెండో ఫిర్యాదుపై మరోసారి పోలీసులు విచారణ చేపట్టారు. మే 20వ తేదీన అభియోగ పత్రాలు మంథని కోర్టులో దాఖలు చేశారు.
ఏప్రిల్ 23 వ తేదీన హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో కేసు విచారణ పూర్తి నివేదికను 15 రోజుల్లో కోర్టుకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో..కేసు విచారణ నివేదికను కోర్టులో సమర్పించనున్నారు పోలీసులు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి హైకోర్టుకు లేఖ రాసిన నేపథ్యంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
అసలు ఏం జరిగింది ?
హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పక్కా రెక్కీ, పకడ్బందీ ప్రణాళిక.. అంతకు మించిన సహనం.. మర్డర్ కోసం మాటు వేసిన బిట్టు శ్రీను స్కెచ్ కలవరానికి గురి చేసింది. వామన్‌రావు దంపతులను పక్కా ప్రణాళిక, రెక్కీతో చంపినట్టు నిర్ధారణ అయింది. నాలుగు నెలలుగా అదును కోసం ఎదురుచూసి హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమ ఆర్థిక లావాదేవీలపై దెబ్బ కొడుతుండటంతో. బిట్టు శ్రీను, కుంట శ్రీనుకు వామన్‌రావు శత్రువుగా మారాడు. అతని అడ్డు తొలగించుకుంటేనే తమ అక్రమాలు సాగించొచ్చని ఇద్దరూ ప్లాన్ చేశారు. శ్రీనులిద్దరూ కలిసి స్కెచ్ వేశారు.
2021, ఫిబ్రవరి 17వ తేదీన వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు ఒంటరిగా వచ్చిన విషయాన్ని తెలుసుకొని తమ ప్లాన్ అమలుకు ఇదే తగిన సమయమని నిర్ధారించుకొని రంగంలోకి దిగారు. ఎప్పటినుంచో వామన్‌రావును చంపేందుకు ఎదురుచూస్తున్న కుంట శ్రీను.. లాయర్ దంపతులు మంథనికి వచ్చిన విషయాన్ని బిట్టు శ్రీనుకు చెరవేశాడు.
అయితే పక్కాగా సమాచారం తెలుసుకున్నాకే మర్డర్ స్టెప్ వేయాలని బిట్టు శ్రీను సూచించగా.. మరోసారి మంథని కోర్టు సమీపంలోని లచ్చయ్య ద్వారా ఆ విషయాన్ని ధృవీకరించుకున్నాడు కుంట శ్రీను. వెంటనే చిరంజీవిని కత్తులతో రావాలని సూచించాడు. కుమార్ సాయంతో వామన్‌రావు దంపతుల కదలికలను తెలుసుకున్న కుంట శ్రీను.. చిరంజీవితో కలిసి రామగిరి దగ్గర మాటు వేసి వారిని మట్టుబెట్టారు.
Read More : Nellore GGH : నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు, విచారణకు ఆదేశం