Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో మళ్లీ వర్షం, ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

కొన్ని రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలతో జనజీవనం స్థంభించింది. Hyderabad Rain

Hyderabad Rain : హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి వాన మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, యూసుఫ్ గూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కూకట్ పల్లి, బాలానగర్, సూరారం, మియాపూర్, హఫీజ్ పేట్, సికింద్రాబాద్, నేరేడ్ మెట్, తిరుమలగిరి, అల్వాల్ లో వర్షం పడుతోంది.

కొన్ని రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలో వానలు దంచికొట్టాయి. ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలతో జనజీవనం స్థంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. కొన్ని ఊర్లకు ఊర్లే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు వరద ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని చోట్ల ఆర్మీ హెలికాప్టర్ల సాయంతో వరదలో చిక్కుకుపోయిన బాధితులను తరలించాల్సి వచ్చింది.

Also Read..Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంపు : కిషన్ రెడ్డి

ఆదివారం వర్షం తెరిపినివ్వడంతో హైదరాబాద్ నగరవాసులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. ఇంతలోనే మళ్లీ వరుణుడు వచ్చేశాడు. మళ్లీ వర్షం పడటం స్టార్ట్ అయ్యింది. దాంతో మరోసారి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ఎక్కడ జలమయం అవుతాయోనని ఆందోళన చెందుతున్నారు.

ఇక హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. హైదరాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, నారాయణపేట, నిర్మల్, మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు