TPCC Campaign Committee : టీపీసీసీ ప్రచార కమిటీ నియామకం… పొంగులేటికి కీలక పదవి

37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.

AICC (1)

Chairman Madhu Yashki Goud : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోన్న కాంగ్రెస్ అధిష్టానం ఏ చిన్న అవకాశం వచ్చిన సువర్ణ అవకాశంగా మార్చుకుని ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని ఏఐసీసీ నియమించింది. ఈ కమిటీ ఛైర్మన్ గా మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ను నియమించిన అధిష్టానం.. మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కమిటీలో చోటు కల్పించింది.

కో ఛైర్మన్ గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ గా సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను నియమించింది.
మరోవైపు 37 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించిన ఏఐసీసీ ఇందులో పలువురు కీలక నేతలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలకు కూడా కమిటీలో చోటు కల్పించింది.

AICC Appointed Observers : తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు పరిశీలకులను నియమించిన ఏఐసీసీ

పీసీసీ అధ్యక్షుడితోపాటు సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వహణ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ ఆఫీస్ బేరర్స్, పార్టీకి సంబంధించిన పలు శాఖలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఏఐసీసీ నియమించింది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్ సభ నియోజకవర్గాల వారిగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. వీరి నియామకం ప్రతిపాదనకు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు