బీబీనగర్ ఎయిమ్స్ లో 141 ప్రొఫెసర్ ఉద్యోగాలు

  • Publish Date - June 5, 2020 / 09:45 AM IST

తెలంగాణలోని యాద్రాది భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (AIIMS)లో ప్రొఫెసర్, అస్టిసెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 141 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (JIPMER) స్వీకరిస్తుంది. 

పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా నిర్ణయించబడ్డాయి. అభ్యర్దులు ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ చూడవచ్చు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొఫెసర్- 20
అడిషనల్ ప్రొఫెసర్- 22
అసోసియేట్ ప్రొఫెసర్- 34
అసిస్టెంట్ ప్రొఫెసర్- 65

వయస్సు:
అభ్యర్దుల వయసు జూన్ 12, 2020 నాటికి 58 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 24, 2020. 
అభ్యర్దులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. దానితో పాటు aiimsfacultyhr@gmail.com ఐడీకి ఇమెయిల్ కాపీ కూడా పంపాలి.

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:

The Nodal Officer,
Office of AIIMS, Bibinagar, Room No.111,2nd Floor,
Administrative Block, JIPMER
Puducherry-605 006.

Read: యురేనియం కార్పొరేషన్‌లో 150 ట్రైనీ Jobs