Asaduddin Owaisi
AIMIM Chief: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి. మరోవైపు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇతైహాదుల్ ముస్లీమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం సన్నద్దమవుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి AIMIM అధికార ట్విటర్ ఖాతా నుంచి అసదుద్దీన్ ప్రసంగంతో కూడిన 57 సెకన్ల నిడివి కలిగిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అసదుద్దీన్ హైదరాబాద్ లోక్‌సభ స్థానం గురించి ప్రస్తావించారు. ఈ వీడియోకు.. పోటీ ఉన్నప్పుడు ఏడవకండి! పోటీ చేద్దాం.. మాట్లాడటం కంటే పోటీ చేయడం నాకు చాలా ఇష్టం అంటూ శీర్షక ఇచ్చారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నా అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ఎన్నికల్లో పోటీచేస్తామని ఎవరో అంటున్నారు. ఏఐఎంఐఎంకు వ్యతిరేకంగా పోరాడతామని ఎవరైనా చెబితే.. వారికి నేను సాధరంగా ఆహ్వానం పలుకుతా అని ఒవైసీ చెప్పారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీరు హైదరాబాద్ నుంచి పోరాడండి.. నేను మెదక్ వెళ్తాను, నేను సికింద్రాబాద్ వెళ్తాను, నేను ఔరంగాబాద్ వెళ్తాను.. అంతేకాదు.. నేను కిషన్‌గంజ్‌కు కూడా వెళ్తాను. ఇది నా కోరిక, నా సంఘం ఒక నిర్ణయం ఉంటుందని అసదుద్దీన్ అన్నారు.
UP woman cop goes missing: ముస్లిం యువకుడితో మహిళా ఎస్.ఐ. పెళ్లికి యత్నం…ఆపై అదృశ్యం
పోటీ వచ్చినప్పుడు ఏడవకండి, పోరాడండి. మీరు ఏఐఎంఐఎంతో పోటీ చేయాలని అనుకుంటే అలానే చేయండి.. పోటీ చేయడాన్ని ఎంతగానో ఆస్వాదిస్తా అని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ తెలంగాణలో పూర్తిస్థాయిలో ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ముస్లిం ఆధిపత్యం స్థానాలతో పాటు ఇతర స్థానాల్లోనూ తన ఉనికి నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Jab muqabla hoga to rona nahi! Aao muqabla karo, Mujhe jitna mazaa muqabla karne mein aata hai, baat-cheet karne mein nahi. – Barrister @asadowaisi pic.twitter.com/IAMGQ3PNej
— AIMIM (@aimim_national) June 18, 2023