Telangana New Airport: మారుతున్న తెలంగాణ ముఖచిత్రం.. కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు.. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం రూ.496 కోట్ల నిధులు

Telangana New Airport: తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వేగంగా అడుగులు వేస్తోంది

Airports Authority of India allocated 496 crore for Warangal airport

  • వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు భారీ నిధులు
  • నాలుగు జిల్లాల్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌లు
  • తెలంగాణ రవాణా రంగానికి ఊతం

Telangana New Airport: తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకరంగాల ప్రగతికి విమానయాన రంగాన్ని విస్తరించడం ఎంతో కీలకంగా మారింది. ఇందులో భాగంగా వరంగల్ విమానాశ్రయంతో పాటు పలు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ఎయిర్‌పోర్ట్స్  అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వేగంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలోని అన్ని కీలక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణ, పూర్తిస్థాయి అభివృద్ధి కోసం AAI సుమారు రూ. 496.86 కోట్ల వ్యయంతో సూత్రప్రాయ ఆమోదం తెలపడమే కాకుండా, రన్‌వే, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణాల కోసం టెండర్లను సైతం ఆహ్వానించింది.

Also Read – Telangana Rains: తెలంగాణలో భారీ వర్షాలు.. ముడు రోజులపాటు దంచికొట్టనున్న వానలు.. ఈ జిల్లాలకు అలర్ట్

అయితే, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, నిధుల లభ్యత ఆధారంగానే ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర, రక్షణ రంగాల ఉమ్మడి వినియోగం కోసం అభివృద్ధి చేసేందుకు AAI ఇప్పటికే ఫీజిబిలిటీ అధ్యయనం పూర్తి చేసింది. అలాగే పెద్దపల్లిలోని గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రాథమిక నివేదికను రాష్ట్రానికి అందజేయగా, భద్రాద్రి కొత్తగూడెం ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఈ నూతన విమానాశ్రయాలు పూర్తయితే తెలంగాణలో ప్రాంతీయ అనుసంధానం మరింత బలోపేతం కానుంది.