Hyderabad city
Hyderabad : హైదరాబాద్ లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అదే సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ (హెచ్-సిటీ) పనుల దృష్ట్యా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -2, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
♦ ఎన్ఎఫ్సీఎల్ నుంచి వచ్చే ట్రాఫిక్…
శ్రీనగర్ కాలనీ టి-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ), కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్డునెంబర్ 36, 45, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహన దారులు శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లింపు తీసుకోవాలి. వీరు శ్రీనగరాకాలనీ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్-5, వెంకటగిరి ఎక్స్‌రోడ్డు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు చేరుకోవచ్చు.
♦ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ -36, 45 నుంచి వచ్చే ట్రాఫిక్..
ఎన్ఎఫ్‌సీఎల్ వైపు వెళ్లే వాహనాలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, వెంకటగిరి రోడ్డు నెంబర్-2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్ గూడ చెక్‌పోస్టు, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజగుట్ట మెయిన్ రోరోడ్డు వైపు వెళ్లవచ్చు.
♦ కేసీపీ, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-1 నుంచి వచ్చే ట్రాఫిక్..
కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్- 45 వైపు వెళ్లవచ్చు.
♦ మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్..
కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు వెళ్లే వాహనాలు విరించి హాస్పిటల్ (1/12) వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐల్యాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 45 వైపు వెళ్లవచ్చు.
వాహనదారులకు సూచనలివే..
♦ సాధ్యమైనంత వరకు రద్దీ సమయాల్లో (ఉదయం 8.30-11, సాయంత్రం 5-9) ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.
♦ ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్ బోర్డులను అనుసరించండి.
♦ తాజా ట్రాఫిక్ అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్ ఉపపయోగించండి.
♦ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రజా రవాణా లేదా కార్ పూలింగ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.
♦ భారీ వాహనాలు రద్దీ సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణించవద్దు.