×
Ad

Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం.. బరిలో 2,290 మంది అభ్యర్ధులు

12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.

  • Published On : November 29, 2023 / 07:39 AM IST

Telangana Assembly Election Polling

Telangana Assembly Election Polling : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. తెలంగాణలో మొత్తం 35 వేల 655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 59 వేల 779 ఈవీఎంలను వినియోగించనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక 13 నియోజక వర్గాల్లో ఉదయం 7 నుంచి 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది.

బరిలో 2,290 మంది అభ్యర్ధులు
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 2,290 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. తెలంగాణ ఎన్నికల బరిలో 221 మహిళా అభ్యర్ధులు ఉన్నారు.  అత్యధికంగా ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో 48 మంది పోటీ చేస్తున్నారు. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడలో ఏడుగురు చొప్పున పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కామారెడ్డి బరిలో 39 మంది అభ్యర్థులు ఉన్నారు. సిద్ధిపేటలో 21, సిరిసిల్లలో 21, కొడంగల్ లో 13 మంది అభ్యర్థుల చొప్పున పోటీ చేస్తున్నారు.

Telangana Assembly Election 2023 : గ్రామాల్లో అత్యధికం…నగరాల్లో అత్యల్పం… ఇదీ గత ఎన్నికల్లో ఓటింగ్ తీరు

ఓటు వేయనున్న 3.26 కోట్ల మంది

తెలంగాణలో 3.26 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 1,62,98,418 పురుషులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణలో 1,63,01,705 మహిళలు ఓటు వేయనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే అధికంగా 3,287 మంది మహిళ ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రంలో 9.9 లక్షల మంది మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే 27వేల వృధ్ద, దివ్యాంగ ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ద్వార సుమారు 1.5 లక్షల మంది ఓటు వేశారు. ఈసీ మొత్తం 35,655 ఈవీఎలను ఏర్పాటు చేసింది.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రత
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం 2.5 లక్షల మంది విధుల్లో ఉన్నారు.

Voter Card : మీకు ఓట‌ర్ కార్డు లేదా..? ఏం తీసుకువెళ్లాలంటే..?

రేపు సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్
ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రంలో రేపు (గురువారం) సాయంత్రం 5 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. సైలెన్స్ పీరియడ్ లో సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. డబ్బు, మధ్యం పంపిణీపై ఎన్నికల సంఘం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఎన్నికల ప్రక్రియను కంట్రోల్ రూం ద్వార పర్యవేక్షిస్తున్నారు. కాగా, పోల్ మేనేజ్ మెంట్ పై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి.