Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్ పర్వంపై అందరి దృష్టి

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీ జరగనున్న నేపథ్యంలో దేశంలో అందరి దృష్టి తెలంగాణపై పడింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. ప్రస్థుతం నవంబర్ 30వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుంది.....

Telangana Assembly Election 2023 : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30వతేదీ జరగనున్న నేపథ్యంలో దేశంలో అందరి దృష్టి తెలంగాణపై పడింది. దేశంలోని తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వతేదీ ఆదివారం వెల్లడికానున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ ముగిసింది. ప్రస్థుతం నవంబర్ 30వతేదీన తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుంది.

మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు

2014వ సంవత్సరం నుంచి బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మరో వైపు కర్ణాటకలో విజయఢంకా మోగించిన కాంగ్రెస్ తెలంగాణలోనూ పాగా వేసేందుకు హోరాహోరీగా పోరాడుతోంది. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలో బీజేపీ ప్రభావం చూపించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక 2014వ సంవత్సరం నుంచి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోంది.

ALSO READ : Election Commission : కర్ణాటక సర్కారుకు ఈసీ షాక్

తొమ్మిదిన్నరేళ్లలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని బీఆర్ఎస్ ఓటర్లను కోరుతోంది. గత అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి 98 సీట్లు ఉన్నాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బరిలో నిలిచాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తామే అధికారంలోకి వస్తామని సర్వేలను ఉటంకిస్తూ ధీమాగా చెబుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అర్హులైన ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు ఓటర్లను కోరారు. అవసరమైన వాటి కంటే 25 శాతం అదనపు ఈవీఎంలను సేకరించారు. ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచే ముందు ప్రాథమిక తనిఖీలు చేశారు.

ఓటర్ల కోసం 1950 హెల్ప్ లైన్

తెలంగాణలోని దాదాపు అన్ని గృహాలకు ఓటరు సమాచార స్లిప్‌లు పంపిణీ చేశామని ఎన్నికల అధికారులు మంగళవారం చెప్పారు. ఏవైనా సందేహాలు ఉంటే ఓటర్లు 1950 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఈసీ కోరింది. ప్రత్యామ్నాయంగా ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ విడుదల చేశారు. ఫోన్‌లలో రిమైండర్‌లు, ఆడియో సందేశాలతో ఓట్ ఫర్ ష్యూర్ ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 80 ఏళ్ల వయసు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు మొట్టమొదటి సారి ఇంటికే ఓటు సదుపాయం కల్పించారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ…ఇంటింటికి కార్యకర్తల బృందాలు

గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి అధిక సంఖ్యలో పోలీసు అధికారులు కూడా ముందుగానే తమ ఓటు వేశారు.పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూను తనిఖీ చేయడానికి ఈసీ యాప్ ఉపకరించనుంది. ఓటర్లు పోలింగ్ రోజును సులభంగా ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్‌లో రద్దీని అంచనా వేయడానికి వీలు కల్పించే ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు.ఈ యాప్ క్యూలో నిలబడిన వ్యక్తుల సంఖ్యను ఓటర్లకు తెలియజేస్తుంది.

ALSO READ : Election Campaign : రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు, రోడ్ షోలు.. తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

పోలింగ్ కేంద్రాలకు మార్గాలను చూపుతూ గూగుల్ మ్యాప్ కి లింక్‌లను కూడా హోస్ట్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 4,119 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రతి అంగుళంపై సీసీటీవీ కెమెరా కన్ను ఉంటుంది. అన్ని ఫీడ్‌లు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని జిల్లా ఎన్నికల అధికారికి, నగర పోలీసు కమిషనర్ కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు