Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలు

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు.

Telangana Formation Day

All Political Parties Organize : ఎన్నికల ఏడాది కావడంతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనునుంది. సీఎం కేసీఆర్ ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం పారామెలటరి బలగాలతో పరేడ్ నిర్వహించనుంది.

TDP Mahanadu : తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు పూర్తి.. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతినిధుల సభ, 60 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభ

ఉత్సవాల జరిపేందుకు కాంగ్రెస్ సైతం రంగంలోకి దిగింది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఉదయం 10:30 గంటలకు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుంది. ఏయే అంశాల ఆధారంగా ఉత్సవాలు చేయాలనే దానిపై కార్యచరణ రూపొందించారు.