చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే హామీలపై సంతకం పెట్టారు.. తెలంగాణలోనేమో..: మహేశ్వర్ రెడ్డి

Alleti Maheshwar Reddy: ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలయినప్పటికీ ఇప్పటికీ హామీలు అమలు చేయడం లేదని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. తాను సీఎం రేవంత్ రెడ్డికి మూడు రోజుల క్రితం లేఖ రాశానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే ఐదు హామీలపై సంతకం పెట్టారని అన్నారు.

అక్కడ వృద్ధాప్య పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో వృద్ధాప్య పెన్షన్లు రూ.4 వేలు చేస్తానని అన్నారని చెప్పారు. పక్క రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని చెప్పారు. ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ హామీలను చంద్రబాబు నెరవేరుస్తున్నారని అన్నారు.

ఏపీలో గత పెన్షన్ కలిపి మొత్తం రూ.7 వేలు ఇస్తానని అన్నారని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు 6 నెలల పెన్షన్ కలిపి మొత్తం వృద్ధులకు రూ.12 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 10 తరగతి వరకు పంపిణీ చేసే పుస్తకాలు విద్యార్థులకు ఇచ్చి మళ్లీ తీసుకున్నారని తెలిపారు.

దీంతో రాష్ట్ర ఖజానాపై మరో భారం పడుతుందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. ఏపీలో గత ముఖ్యమంత్రి బొమ్మ ఉన్న పుస్తకాలను పిల్లలకు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి మార్పుపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

Also Read:ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయింపు.. పవన్ కల్యాణ్‌కు కేటాయించిన శాఖ ఏదంటే?

ట్రెండింగ్ వార్తలు