అందుకే హైడ్రా పేరుతో నిర్మాణాలు కూల్చేస్తున్నారు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

మొదట కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలవుతే మంచిదని అన్నారు.

Alleti Maheshwar Reddy (Photo: @BJP4Telangana)

హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఇప్పుడు హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సంచలనం చేస్తున్నారని అన్నారు.

దానం నాగేందర్‌పై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు మరి ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. మొదట కాంగ్రెస్ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలవుతే మంచిదని అన్నారు. మంత్రి పొంగులేటిపై కూడా అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్‌తో కట్టుకుని నష్టపోయిన వారికి ఎటువంటి హామీ ఇస్తున్నారని నిలదీశారు. డైవర్ట్ పాలిటిక్స్ కోసమే ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చి వేశారని చెప్పారు. తెలంగాణకు కబ్జాకు గురైన అసైన్డ్ భూములతో పాటు దేవాదాయ, చెరువు శిఖం భూములపై కాంగ్రెస్ సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.

కాగా, మాదాపూర్‌లోని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేయించిన విషయం తెలిసిందే. కూల్చివేతలపై ఇప్పటికే ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది.

Also Read: నెక్లెస్‌రోడ్‌ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది.. దాన్ని తొలగిస్తారా?: అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్

ట్రెండింగ్ వార్తలు