Hyderabad Car Accident : నా పిల్లలు నాన్నెక్కడ అని అడుగుతున్నారు .. అతివేగంతో మాలాంటి జీవితాలతో ఆటలాడుకోవద్దు

అతివేగం వద్దు అని పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యం ఎంతోమంది ప్రాణాలు తీసేస్తోంది. మరెంతోమంది జీవితాలను ఛిన్నా భిన్నం చేస్తోంది. అల్వాల్ లో కారు సృష్టించిన బీభత్సానికి స్విగ్గీ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోగా అతని భార్యాపిల్లల భవిష్యత్తు అంథకారమైపోయింది. మరో వ్యక్తి కాలు విరిగిపోయి అతని భార్యా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇళా అతి వేగం ఎంతోమంది జీవితాలను కల్లోలపరుస్తోంది.

Hyderabad Car Accident : సికింద్రాబాద్‌ అల్వాల్‌ లోని కానజిగూడలో రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఒక మృతి చెందారు.మరొకరు తీవ్రంగా గాయడపడ్డారు. చనిపోయిన వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్ రాజుగా గుర్తించారు పోలీసులు. ఈ కారు ప్రమాదంలో మృతి చెందిన స్విగ్గీబాయ్ రాజు భార్య సోని కన్నీరు మున్నీరుగా విలపించారు. నా బిడ్డల భవిష్యత్తు ఏంటీ? అంటూ ఆందోళన వ్యక్తంచేస్తు నా ఇద్దరు పిల్లలు నాన్నెక్కడ అని అడుగుతున్నారు నేను ఏం సమాధానం చెప్పాలి? అంటూ గుండెలు పిండేసేలా విలపిస్తోంది. నన్ను నా పిల్లల్ని రాజు బంగారం లాగా చూసుకునేవాడని. నాపాపకి ఐదు సంవత్సరాలు, బాబుకి రెండు సంవత్సరాలు ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటీ? పనికని వెళ్లినవాడు కనిపించకుండానే పోయాడు ఇలా జరుగుతుందనే కలలో కూడా అనుకోలేదు అంటూ ఆమె ఆవేదన చూసినవారి కళ్లు కన్నీటితో నిండిపోతున్నాయి.

ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది.. వెంటనే పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పారు .రాజు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు ఉదయం ఎనిమిది గంటలకు పోలీసులు చెప్పారు ఎప్పటిలానే డెలివరీ కి వెళ్లి లేటుగా వస్తాడేమో అనుకున్నాముగానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదంటూ విలపిస్తోంది సోని.సంవత్సరం నర నుండి స్విగ్గిలో డెలివరీ బాయ్ గా పని చేసే రాజు పని లేదా ఇల్లు.. ఇదే నా రాజు లోకం..పిల్లలంటే ప్రాణం..నన్ను చాలా బాగా చూసుకునేవాడు..నా సంసారం సంతోషంగా సాగిపోయేది.. మేమంటే ప్రాణం పెట్టే రాజుని ఇలా అర్థాంతరంగా ఓకారు పొట్టన పెట్టుంది. అతివేగం మా జీవితాలను ఛిన్నాభిన్నం చేసేసింది అంటూ ఆవేదన వ్యక్తంచేసింది సోని. నా భర్తను పొట్టన పెట్టుకున్న వాళ్లకు కఠిన శిక్షంచాలి అంటూ సోని ఆవేదనతో డిమాండ్ చేసింది. ఇలాంటి కష్టం ఎవ్వరికి రాకుండా ఉండాలంటే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

అలాగే ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు పోగొట్టుకున్న రాజ్ కుమార్ అనే ఓ చిరువ్యాపారి ఆవేదన కూడా అంతా ఇంతా కాదు. సుచిత్ర నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందిని తెలిపాడు రాజు. రాంగ్ రూట్లో ఓ కారు అతివేగంగా వచ్చి అక్కడ ఉన్న షాపులతోపాటు నన్ను మరొక వ్యక్తిని ఢీకొట్టిందని.. నాతో పాటు మరో వ్యక్తి ఒకేసారి హాస్పిటల్ కి తీసుకువచ్చారని.. హాస్పిటల్ కు వచ్చిన తర్వాత రాజు అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో అతని చనిపోయాడని తెలిపాడు. నేను సుచిత్రలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో పని చేస్తానని ఈ ఘటనలో నాకు ఎడమ కాలు విరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు రాజ్ కుమార్.

జీవన ఉపాధి కోసం మేము రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాముని నాకు ఇద్దరు పిల్లలు భార్య ఉన్నారని కానీ ఏదో చిన్నపాటి పని చేసుకుంటూ జీవించే మా జీవితాల్లో కారు.. కారుచీకట్లను నింపచేసింది ఆవేదన వ్యక్తం చేశాడు. ఏ సంబంధం లేకుండా మేము ప్రమాదానికి గురైయ్యామని.. ఈ ఘటనలో చనిపోయిన రాజు కూడా పిల్లలు భార్య ఉన్నారని ఇలా మా జీవితాల్ని కారు ఛిన్నాభిన్నం చేసేసిందని తెలిపాడు. చాలా చాలా బాధగా ఉంది.. కొత్తగా కొనుక్కున్న బండితోపాటు మొబైల్ ఫోన్ ధ్వంసం అయిందని.. ఆ ప్రమాద సమయం తలుచుకుంటే భయంగా ఉందని ఎవరు దయచేసి అతివేగంగా డ్రైవ్ చేసి ప్రమాదాలు చేయవద్దని మాలాంటి జీవితాలతో ఆటలాడుకోవద్దని కన్నీటితో వేడుకున్నాడు రాజ్ కుమార్.