Telangana Exams : తెలంగాణలో పరీక్షలు జరిగేనా?

తెలంగాణలో పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్పెషల్‌ సీఎస్‌ ఛాంబర్‌లో విద్యాశాఖ మీటింగ్‌ ఏర్పాటు చేసినా.. అధికారులు ఉన్నపళంగా మీటింగ్‌ స్పాట్‌ను చేంజ్‌ చేశారు.

conduct of examinations in Telangana : తెలంగాణలో పరీక్షల నిర్వహణపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. స్పెషల్‌ సీఎస్‌ ఛాంబర్‌లో విద్యాశాఖ మీటింగ్‌ ఏర్పాటు చేసినా.. అధికారులు ఉన్నపళంగా మీటింగ్‌ స్పాట్‌ను చేంజ్‌ చేశారు. సీక్రెట్‌ ప్లేస్‌లో స్పెషల్‌ సీఎస్‌, ఇంటర్‌, ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారులు సమావేశమయ్యారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

ఇటు ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులను పరీక్షలు లేకుండానే సెకండియర్‌కు ప్రమోట్‌ చేసి.. సెకండియర్‌ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయనున్నట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం అధికారులు సీఎంను కలిసి పరిస్థితిని వివరించనున్నారు. సాయంత్రంలోగా ఈ విషయంపై క్లారిటీ రానుంది.

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేయాలని, సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు స్పెషల్ సీఎస్ తో భేటి ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లనున్న విద్య శాఖ అధికారులు..సాయంత్రం సీఎమ్ వో నుంచి ప్రకటన విడుదల చేయనున్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు