boy killed in a street dogs attack : హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. వీధి కుక్కలు ఓ బాలుడి ప్రాణం తీశాయి. బహదూర్‌పురాలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో.. ఎనిమిదేళ్ల అయాన్ మృతి అనే బాలుడు మృతి చెందాడు. వీధి కుక్కల నుంచి మరో బాలుడు తప్పించుకున్నాడు.
కిషన్ బాగ్ ఏరియాలో కుక్కల దాడి ఘటనపై బల్దియా అధికారులు దృష్టి సారించారు. వీధి కుక్కల విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులను ఆదేశించారు. కిషన్‌బాగ్, అసద్‌బాబా ప్రాంతాల్లో 2 వెహికిల్స్‌తో పాటు 16 మంది డాగ్ క్యాచర్‌లతో వీధి కుక్కలను పట్టుకుంటున్నారు.
ఒకేసారి 5 కుక్కలు పిల్లలపై దాడి చేయడంతో ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. వీధిలో ఆడుకుంటున్న పిల్లలపై కుక్కలు దాడి చేయడంతో అందరూ పారిపోగా… ఎనిమిదేళ్ల అయాన్ మాత్రం తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అయాన్ మృతితో కిషన్ బాగ్ ఏరియాలో తీవ్ర విషాదం నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అయాన్ మృతి చెందాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అటు… మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్‌లో వీధి కుక్కలు హల్‌చల్ చేశాయి. ఒక్కసారిగా కుక్కల గుంపు మీదపడి దాడిచేయడంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.