Jogulamba Gadwala : మనిషి ముఖాన్ని పోలిన కీటకం

ఈ కాండం తొలుచు కీటకాన్ని చూసి పాషా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

insect human face

Insect Human Faceinsect human face : ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. తెలంగాణలో వింత కీటకం దర్శనమిచ్చింది. అచ్చం మనిషి ముఖాన్ని పోలిన కీటకం జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రత్యక్షమైంది. చెనుగోనిపల్లికి చెందిన హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి ముఖాన్ని తలపించేలా ఉన్న పురుగు కనిపించింది.

ఆశ్చ్యర్యంగా ఉన్న ఈ వింత పురుగుకు కళ్లు, ముక్కు, నోరు, తల భాగం అచ్చం మనిషిని పోలి ఉన్నాయి. ఈ కాండం తొలుచు కీటకాన్ని చూసి పాషా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

strange creature : అమరిల్లో సిటీలో వింత ఆకారం.. అంతుచిక్కని మిస్టరీ..

కాగా, ఈ కీటకాన్ని స్టిక్ బగ్ (కాండం తొలుచు కీటకం) అంటారని పాలమూరు యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఇవి ఎల్లో, పింక్, రెడ్ కలర్స్ లో ఉంటాయని తెలిపారు. ఇవి ఎక్కువగా శ్రీలంక, ఆఫ్రికా, థాయ్ లాండ్ దేశాల్లో కనిపిస్తాయని వెల్లడించారు. ఇండియాలో తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.