Warangal Mgm Hospital
An old man died with Corona : వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. రోగులకు సరిగ్గా కోవిడ్ వైద్యం అందకపోవడంతో ఒక్కొక్కరుగా మృత్యువాత పడుతున్నారు. రోజుకు 20 నుంచి 30 మంది కోవిడ్ రోగులు చనిపోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం (మే 5, 2021) మరో 30 చనిపోయారు.
మరోవైపు ఎంజిఎంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఆస్పత్రి ఎదుట కరోనాతో ఓ వృద్ధుడు చనిపోయిన ఘటన కంటతడి పెట్టిస్తోంది. వృద్ధుడికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఎంజిఎంకు వచ్చాడు. ఆస్పత్రి ఆవరణంలో చెట్టు కింద కుప్పకూలిపోయాడు.
ఊపిరి తీసుకునేందుకు నరకయాతన అనుభవించాడు. పక్కనే అంబులెన్స్ ఉన్నా పట్టించుకోలేదు. ఆస్పత్రి సైతం వృద్ధుడిని లోపలికి తీసుకెళ్లేందుకు సాహసించలేదు. అనాథలా ఆస్పత్రి ఆవరణలోనే చనిపోయాడు.