3 ఏళ్ల పాటు అతడు నా కూతురి వెంటపడ్డాడు.. వేధించాడు: యాంకర్ స్వేచ్ఛ తండ్రి శంకర్

"మానసిక వేదన వల్లే నిన్న ఆత్మహత్య చేసుకుంది" అని చెప్పారు.

Swetcha

తెలుగు యాంకర్ స్వేచ్ఛ మృతిపై ఆమె తండ్రి శంకర్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురి మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తి కారణమని అన్నారు.

“మూడు సంవత్సరాల నుంచి పూర్ణచంద్రరావు నా కూతురు వెంటపడుతున్నాడు. పూర్ణచందర్ వేధింపుల వల్లే నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. నా కూతురుని పెళ్లి చేసుకుంటానని మూడు సంవత్సరాల నుండి పూర్ణచందర్ వెంటపడి వేధించాడు.

నా కూతురు పెళ్లికి అంగీకరించిన తర్వాత ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. గొడవలు తారస్థాయికి చేరడంతో ఇటీవల నా కూతురు పూర్ణచందర్‌తో ఉండను అని తేల్చి చెప్పింది. జూన్ 26న ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది.

Also Read: కోల్‌కతా సామూహిక అత్యాచార ఘటన.. విద్యార్థిని దేహంపై పంటిగాట్లు.. ప్రధాన నిందితుడి గురించి సంచలన విషయాలు వెల్లడి

ఆ రోజు నేను స్వేచ్ఛతో మాట్లాడాను. పూర్ణచందర్‌తో సంబంధం కొనసాగించలేనని తేల్చి చెప్పింది. పూర్ణచందర్ వేధింపుల వల్లే నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైంది. మానసిక వేదన వల్లే నిన్న ఆత్మహత్య చేసుకుంది” అని చెప్పారు.

కాగా, స్వేచ్ఛ తల్లిదండ్రులు ఇప్పటికే హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛ మృతిపై అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఆమె మృతికి కారణం పూర్ణచందరే అంటూ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.